కొడుకు అరెస్ట్..చంద్రబాబుకు కంగ్రాట్స్
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చిత్తూరు జిల్లా – చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
తన కొడుకు ప్రమేయం లేక పోయినా కావాలని టార్గెట్ చేస్తూ అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. తను విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడని, ప్రజా జీవితంలోకి వచ్చాడని చెప్పారు. కావాలని అక్రమ కేసును బనాయించారని, అరెస్ట్ చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఏది ఏమైనా విదేశాల్లో చదువుకున్న తన తనయుడిని వీధి పోరాటాలకు సిద్దం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏది ఏమైనా ఇలా చేసినందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే.
తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగిన వాడినని అన్నారు. తనకంటే మించి తన కొడుకు ప్రజల పక్షాన నిలబడతాడని, ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ సర్కార్ కు, పోలీసులకు చూపించడం ఖాయమని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.