ENTERTAINMENT

స‌న్నీ లియోన్ పేరుతో ఫేక్ అకౌంట్

Share it with your family & friends

ప్ర‌తి నెలా రూ. 1000 ల‌బ్ది

చ‌త్తీస్ గ‌ఢ్ – ఓ ప్ర‌బుద్దుడు ఏకంగా పోర్న్ స్టార్ స‌న్నీ లియోన్ పేరుతో ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేశాడు. ఆపై ఏకంగా ప్ర‌తి నెలా రూ. 1,000 పెన్ష‌న్ పొందుతున్నాడు. ఈ విష‌యం అధికారుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ లో చోటు చేసుకుంది.

పెళ్ల‌యిన మ‌హిళ‌ల‌కు మ‌హాత‌రీ వంద‌న్ యోజ‌న పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది. ప్ర‌తి నెలా వేయి జ‌మ చేస్తూ వ‌స్తోంది. అనుమానం వ‌చ్చి ఎంక్వైరీ చేస్తే వీరేంద‌ర్ జోషి అనే వ్య‌క్తి అని తేలింది. ఇదిలా ఉండ‌గా మ‌హాత‌రీ వంద‌న్ యోజ‌న స్కీంలో త‌ప్ప‌నిస‌రిగా పెళ్లి చేసుకుని ఉండాలి. లేక పోతే ఆ ప‌థ‌కం మ‌హిళ‌కు వ‌ర్తించ‌దు. అంతే కాకుండా భ‌ర్త పేరు కూడా త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల్సి ఉంటుంది.

ఈ ప‌థ‌కం కింద ల‌బ్ది పొందేందుకు స‌ద‌రు ల‌బ్దిదారుడు న‌కిలీ ప‌త్రాల‌ను సృష్టించాడు. వాస్త‌వానికి న‌టి స‌న్నీ లియోన్ భ‌ర్త పేరు జానీ సిన్స్ . అడ‌ల్ట్ ఫిల్మ్ స్టార్ అని కూడా ఇందులో పొందు ప‌ర్చ‌డం విశేషం.
బ‌స్త‌ర్ అని చిరునామా ఉండ‌డంతో విచార‌ణ ప్రారంభించారు. చివ‌ర‌కు అవ‌న్నీ ఫేక్ అని తేలాయి. ఈ విష‌యంపై జిల్లా క‌లెక్ట‌ర్ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *