అద్భుతమైన ఆర్థిక వేత్త
హైదరాబాద్ – మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరంతో భేటీ అయ్యారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా కొత్తగా సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు చిదంబరం. ఈ సందర్బంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి తన తరపు నుంచి మొక్కను జ్ఞాపికగా అందజేశారు.
మాజీ మంత్రి, సీఎం మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. రాష్ట్రంలో కొలువు సర్కార్ ఎలా పని చేస్తోందని ఆరా తీశారు. అవసరమైన మేరకు సలహాలు, సూచనలు అందజేశారు రేవంత్ రెడ్డికి చిదంబరం. రాజకీయ పరంగా అపారమైన అనుభవం ఉంది.
కేంద్ర మంత్రిగా , పార్టీ పరంగా ఎన్నో పదవులు నిర్వహించిన చరిత్ర చిదంబరంది. ఆయన కీలకమైన నాయకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. పార్టీకి లాయల్ గా ఉంటూనే అవసరమైన సమయంలో కీలక అంశాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఆర్థికవేత్తగా ఆయన మేధావి అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో పలువురు మేధావులతో చర్చలు జరిపారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.