ఏపీ ఖాకీలపై సీఈసీ కన్నెర్ర
పల్నాడు కలెక్టర్ పై బదిలీ వేటు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ అయ్యింది. ఇప్పటికే పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యం వహించారంటూ మండిపడింది ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ గుప్తాలపై. ఇద్దరూ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే సమయంలో పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తాజాగా ఏపీ పోలీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ పై మండిపడింది. ఆయనను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది.
అంతే కాకుండా కలెక్టర్ తో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ తో పాటు అనంతపురం జిల్లా ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్క అధికారిపై శాఖా పరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది సీఈసీ. వెంటనే సిట్ ను ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారో రెండు రోజుల్లో వివరాలని స్పష్టం చేసింది.