Friday, April 4, 2025
HomeNEWSజాతీయ లోక్ అదాల‌త్ లు ప్రారంభం

జాతీయ లోక్ అదాల‌త్ లు ప్రారంభం

వ‌రంగ‌ల్..హ‌న్మ‌కొండ జిల్లాల్లో

హైద‌రాబాద్ – మొదటి జాతీయ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్రంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక ఛైర్మన్ సుజోయ్ పాల్ వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో లోక్ అదాల‌త్ ల‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ్, జ‌స్టిస్ మౌష‌మి భ‌ట్టాచార్య వ‌ర్చువ‌ల్ గా హాజ‌ర‌య్యారు.

జాతీయ లోక్ అదాలత్‌లో సమస్యల‌ను పరిష్కరించిన లబ్ధిదారులకు తాత్కాలిక న్యాయమూర్తి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కోర్టుల ఆధ్వ‌ర్యంలో లోక్ అదాల‌త్ ల‌ను ప్రారంభించారు. గ‌త కొంత కాలంగా అపరిష్క్రృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను న్యాయ‌మూర్తులు పాల్గొని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఆయా లోక్ అదాల‌త్ ల‌కు భారీ ఎత్తున బాధితులు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు లోక్ అదాల‌త్ ల గురించి. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. జిల్లాల క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో వీటిని ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments