దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సౌందర్య రాజన్, కొడుకు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన కలకలం రేపింది. టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్ గా కొనసాగుతున్నారు. అర్చకుల ఇంట్లోకి చొరబడి వీరిని తీవ్రంగా గాయపర్చారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎందరికో ధర్మ మార్గం చూపించి, వేలాది మంది భక్తుల కోరికలు స్వామి వారికి తెలియజేసి, అనేక మందిని జ్ఞాన మార్గంలో నడిపించిన మహానుభావుడు శ్రీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేయడం దారుణమన్నారు .
ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు హిందూ భక్తులు. హిందూ ధర్మంపై, ప్రధానంగా ఆలయాల పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా పోరాడుతూ వస్తున్నారు సౌందర్య రాజన్, రంగరాజన్.
ఆలయాలను అభివృద్ది చేయాలని, ప్రభుత్వ పరిధిలో ఉండ కూడదని, దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్టించు కోవడం లేదంటూ ఈ ఇద్దరు గత కొంత కాలంగా పోరాడుతూ వస్తున్నారు.