రాహుల్ కు రంగరాజన్ కితాబు
పార్లమెంట్ లో శివుడి చిత్రపటం
హైదరాబాద్ – చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ పార్లమెంట్ లో అద్భుతమైన దృశ్యానికి వేదికగా మారడం తనను సంతోషానికి గురి చేసిందన్నారు.
ఇందులో భాగంగా మెజారిటీ భారతీయ జనతా పార్టీ పరివారానికి షాక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా పార్లమెంట్ లోకి పరమ శివుడిని సభలోకి తీసుకు వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు రంగరాజన్.
భగవంతుడి పేరిట ప్రమాణం చేసిన 543 మంది ఎంపీలు రాజ్యాంగం లోని శ్రీరామ చిత్రపటాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేయాలని చిల్కూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా అర్చకులు రాహుల్ గాంధీని విమర్శిస్తుంటారు. కానీ రంగరాజన్ ఉన్నట్టుండి రాహుల్ ను ఆకాశానికి ఎత్తేయడం విస్తు పోయేలా చేసింది.