Friday, April 4, 2025
HomeDEVOTIONALచిన్న శేష వాహ‌నంపై క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

చిన్న శేష వాహ‌నంపై క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

శ్రీ వేణు గోపాల కృష్ణుడి అవ‌తారంలో ద‌ర్శ‌నం

తిరుప‌తి – తిరుప‌తిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచ భూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments