అగ్ని ప్రమాదంపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వార్నింగ్
తిరుపతి – కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై స్పందించారు చింతా మోహన్ .
ఎవరూ ఊహించని రీతిలో పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల పలు అనుమానాల ఉన్నాయని అన్నారు. వెంటనే దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేక పోతే తాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేస్తానంటూ చింతా మోహన్ హెచ్చరించారు.
ఇదే సమయంలో ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన బాహుబలి కాదని బలహీన బలి అంటూ ఎద్దేవా చేశారు. పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు చింతా మోహన్.
కేంద్రం నుంచి సాయం కోసం సాగిల పడటం ఎందుకని నిలదీశారు. కేంద్రమే చెక్కులతో చంద్రబాబు వద్దకు రావాలని అన్నారు. ఇదే సమయంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను చూసి చంద్రబాబు నేర్చు కోవాలని హితవు పలికారు మాజీ కేంద్ర మంత్రి.
చంద్రబాబు నాయుడు పదే పదే ఢిల్లీకి వెళ్లడం వల్ల ఉన్న పరువు పోతుందని సూచించారు .