మోడీకే నా సంపూర్ణ మద్దతు
ప్రకటించిన చిరాగ్ పాశ్వాన్
బీహార్ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు దివంగత నేత రామ్ విలాశ్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్. తన పార్టీ బీహార్ లో పోటీ చేసిన 5 స్థానాలలో గెలుపొందారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
తాను హనుమంతుడి లాంటి వాడినని, మోడీ శ్రీరాముడని కొనియాడారు. ఆయనకు అపర భక్తుడిగా ఉంటానని ప్రకటించారు. తాను మోడీని వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు చిరాగ్ పాశ్వాన్. తనను ఆదరించడంతో పాటు తన పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను భారీ మెజారిటితో గెలుపొందేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు పాశ్వాన్.
తాను ప్రధాని మోడీ కి బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. నా దృష్టిలో మోడీనే ఈ దేశానికి రక్షకుడని, ఆయన నాయకత్వం ఈ దేశానికి అవసరమని అన్నారు. ఆయన ప్రధాని కావడం పక్కా అని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.