తండ్రికి తగ్గ తనయుడు
చిరాగ్ పాశ్వాన్ కు చోటు
న్యూఢిల్లీ – పట్టు వదలని విక్రమార్కుడి లాగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు మాజీ కేంద్ర మంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్. తన బాబాయ్ తో చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఎన్డీయే సర్కార్ ప్రధానంగా బీజేపీ తీవ్రంగా అవమానించింది. కానీ ఊహించని రీతిలో చిరాగ్ పాశ్వాన్ బీహార్ లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటారు. ఏకంగా లోక్ జన శక్తి పార్టీ తరపున 5 సీట్లను కైవసం చేసుకునేలా కృషి చేశాడు.
మోడీ కొత్త కేబినెట్ ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించాడు చిరాగ్ పాశ్వాన్. తాజాగా కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో చోటు దక్కించుకునే స్థాయికి ఎదిగాడు. నరేంద్ర మోడీ తనను స్వంత కొడుకుగా అభివర్ణించడం విశేషం. ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అక్టోబర్ 31, 1982లో పుట్టాడు చిరాగ్ పాశ్వాన్. తన వయసు ఇప్పుడు 41 ఏళ్లు. నటుడిగా కూడా పేరు పొందాడు. 2021 నుండి లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీహార్ లోని హాజీపూర్ లోక్ సభ స్థానం నుండి గెలుపొందాడు చిరాగ్ పాశ్వాన్. తాను మోడీకి అపర భక్తుడినని,, ఆంజనేయ స్వామి లాగా ఉంటానని పేర్కొన్నాడు.