సిగ్గులేని కాపులంటూ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడంటూ ఆరోపించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు బానిసయ్యాడని ఫైర్ అయ్యారు. సిగ్గులేనోళ్లు మాత్రమే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ బోర్డులు పెట్టుకుంటారంటూ ధ్వజమెత్తారు.
విచిత్రం ఏమిటంటే మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్లోగన్స్ చేయాలంటూ మెస్సేజ్ లు చేపించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు వీళ్లు ఎలా స్టార్స్ అవుతారంటూ ప్రశ్నించారు. వీళ్ల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ ఉండదన్నారు. మీ విలువైన సమయం వేస్ట్ చేసుకోవడం తప్పించి.
ప్రజల కోసం పని చేయడం లేదని, కేవలం తమ ఆస్తులను కాపాడు కునేందుకు మాత్రమే వీరు ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ కేఏ పాల్. ఎవరు ఏమిటనేది ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తాజాగా పాల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.