చిరంజీవి..చరణ్ రూ. కోటి విరాళం
వయనాడు బాధితుల కోసం ప్రకటన
హైదరాబాద్ – ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఆయన తన ఉదారతను చాటుకున్నారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కేరళ ప్రభుత్వానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు వయనాడులో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి విలయ తాండవానికి ఏకంగా 278 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరారు.
ఈ మేరకు తమ వంతు సాయంగా వయనాడు బాధితుల కోసం రూ. 1 కోటి సాయంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు చిరంజీవి. ఈ మొత్తాన్ని కేరళ రిలీఫ్ ఫండ్ కు తనతో పాటు రామ్ చరణ్ కలిసి ఈ సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
మరో వైపు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడును సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున 100 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం కేరళ లో చోటు చేసుకున్న ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.