ప్లీజ్..పవన్ ను గెలిపించండి
మెగాస్టార్ మెగా సందేశం
హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు, నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం వినిపించారు. దయచేసి పవన్ ను గెలిపిస్తే రేపటి భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. తను మొదటి నుంచి ప్రజల కోసం పని చేస్తున్నాడని, వారంతా బాగుండాలని కోరుకుంటున్నాడని తెలిపారు.
పిఠాపురం ప్రజలంతా పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించి తమ అభిమానాన్ని చాటు కోవాలని కోరారు చిరంజీవి. ఇదిలా ఉండగా మెగాస్టర్ గతంలో ప్రజా రాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు.
అనంతరం రాజకీయాల నుంచి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే తన సోదరులు ఇద్దరూ ఇప్పుడు జనసేన పార్టీలో కీలకంగా మారారు. ఒకరు పవన్ కళ్యాణ్ మరొకరు నాగ బాబు. ఆయన తనయుడు , నటుడు వరుణ్ తేజ్ సైతం తన బాబాయి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ చిరంజీవి చేసిన వీడియోను స్వయంగా కొడుకు , నటుడు రామ్ చరణ్ షేర్ చేయడం విశేషం.