సమిష్టి పోరాటం అద్భుత విజయం
అభినందనలు తెలిపిన చిరంజీవి
హైదరాబాద్ – ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమి అద్బుత విజయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. బాబుతో పాటు తన సోదరుడు పవన్ కళ్యాణ్ సైతం ఆశించిన దానికంటే గెలుపొందడం పట్ల మరింత ఆనందంగా ఉందన్నారు.
మంగళవారం చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ఎవరూ ఊహించని విజయమని పేర్కొన్నారు. తాను కలలో కూడా అనుకోలేదన్నారు. ప్రత్యేకించి అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా మీరు గుర్తింపు పొందారంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు మెగాస్టార్.
ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానని స్పష్టంచేశారు చిరంజీవి.