ENTERTAINMENT

సోద‌రా నువ్వు నిజంగా తోపురా

Share it with your family & friends

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చిరంజీవి ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్ – జ‌న‌సేన పార్టీ చీఫ్ , వ‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత విజ‌యాన్ని సాధించ‌డం ప‌ట్ల శుభాకాంక్ష‌లు తెలిపారు అన్న‌య్య‌, ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి. మంగ‌ళ‌వారం జ‌న‌సేన కూట‌మి ఏపీలో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేయ‌డాన్ని స్వాగ‌తించారు. ఈ సంద‌ర్బంగా త‌న సోద‌రుడైనందుకు త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఇది మామూలు విజ‌యం కాద‌న్నారు చిరంజీవి.

డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఎన‌లేని సంతోషం క‌లుగుతోంద‌ని తెలిపారు.
నువ్వు గేమ్ ఛేంజ‌ర్ వి మ‌త్ర‌మే కాదు ఈ ఎన్నిక‌ల కురుక్షేత్రమ‌నే మ్యాచ్ లో నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అంద‌రూ పొగుడుతుంటే మాట‌లు రావ‌డం లేదన్నారు చిరంజీవి.

, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు అని పేర్కొన్నారు.