ట్రబుల్ షూటర్ తో మెగాస్టార్
కేంద్ర మంత్రితో కరచాలనం
న్యూఢిల్లీ – తెలుగు సినిమా రంగానికి చెందిన తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ ఇద్దరూ ఇప్పుడు నరేంద్ర మోదీకి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. అయోధ్యలో కనిపించారు. తాజాగా పద్మ విభూషణ్ అత్యున్నత దేశానికి చెందిన అవార్డును అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్బంగా కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లింది. తిరిగి హైదరాబాద్ కు వచ్చింది.
ఇదిలా ఉండగా పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా డిన్నర్ ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ ప్రత్యేకంగా షాతో భేటీ అయ్యారు. ఆయనతో కరచాలనం చేశారు. రామ్ చరణ్ కూడా ఉన్నారు.
తన సోదరుడు , నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఏపీలో బీజేపీతో కలిసి బరిలో ఉన్నారు. గతంలో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత దూరమయ్యారు. ఇప్పుడు తాను ఏ పార్టీ లో లేనని చెప్పడం విశేషం.