ప్రైవేట్ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటా హుటిన శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా మెగాస్టార్ ఫ్యామిలీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. తన తల్లికి అనారోగ్యంకు గురి కావడంతో విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన విజయవాడ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఇటీవలే అంజనాదేవి పుట్టినరోజు జరుపుకున్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పంచుకున్నారు. అంజనాదేవికి ముగ్గురు కొడుకులు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ . కాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ప్రస్తుతం అంజనా దేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. చికిత్సకు ఆమె సహకరిస్తున్నారని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా అంజనాదేవి ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది మెగా ఫ్యాన్స్. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తను బాగుండాలని కోరుకుంటున్నారు.