ఆనందంగా ఉందన్న మెగాస్టార్
హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం సినీ దిగ్గజంగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవికి దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆయనతో పాటు ఏపీకి చెందిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ప్రముఖ రాజకీయ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న ప్రకటించింది.
ఈ సందర్బంగా వివిధ సినీ, రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య , ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులు మెగాస్టార్ ను అభినందనలతో ముంచెత్తారు. తాజాగా చిరంజీవి కోడలు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆధ్వర్యంలో మెగా అభినందన సభ చేపట్టారు.
ఈ సందర్బంగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. అనంతరం పురస్కార గ్రహీత మెగాస్టార్ మాట్లాడుతూ తనకు పురస్కారం ప్రకటించినందుకు కేంద్ర సర్కార్ కు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు చిరంజీవి.