ENTERTAINMENT

అక్కినేనితో అనుబంధం చిర‌స్మ‌ర‌ణీయం

Share it with your family & friends

తెలుగు సినిమా రంగంలో గొప్ప న‌టుడు

హైద‌రాబాద్ – మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. త‌న‌కు ప్ర‌ముఖ దివంగ‌త న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా త‌న ఆనందాన్ని పంచుకున్నారు .

తెలుగు సినిమా రంగానికి సంబంధించి అరుదైన న‌టుల‌లో అక్కినేని నాగేశ్వ‌ర్ రావు ఒక‌రు అని కొనియాడారు. ఆయ‌న న‌ట‌నను చూసి తాను ఎన్నో మెళ‌కువ‌లు నేర్చుకున్న‌ట్లు తెలిపారు. అక్కినేని లాంటి గొప్ప న‌టుడితో క‌లిసి తెర పంచు కోవ‌డం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు న‌టుడు మెగాస్టార్ చిరంజీవి.

చాలా మంది న‌టులుగా మిగిలి పోతార‌ని, కానీ అక్కినేని అలా కాద‌ని, ఆయ‌న ఎన్నో క్లాసిక‌ల్ సినిమాలు ఇప్ప‌టికీ జ‌నాద‌ర‌ణ పొందుతూనే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. దేవ‌దాసు, మిస్స‌మ్మ‌, మాయా బ‌జార్, ప్రేమన‌గ‌ర్ , ప్రేమాభిషేకం, గుండ‌మ్మ క‌థ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప సినిమాలు ఉన్నాయ‌ని తెలిపారు చిరంజీవి.

ఏఎన్ఆర్ పుర‌స్కారం త‌న‌కు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల అక్కినేని నాగార్జున‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 28న ఏఎన్ఆర్ అవార్డును బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ చిరంజీవికి బ‌హూక‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు న‌టుడు నాగార్జున‌.