మత్తు వదలరా -2 మూవీ సూపర్ – చిరంజీవి
ఈమధ్య కాలంలో ఇంతాల నివ్వించింది లేదు
హైదరాబాద్ – ప్రముఖ నటుడు , మెగస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రితీశ్ రాణా తీసిన మత్తు మదలరా -2 సీక్వెల్ మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
మత్తు వదలరా -2 చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా బాగుందంటూ కితాబు ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని పేర్కొన్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి పూర్తయ్యేంత దాకా సినిమాను వదలకుండా చూశానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలని పేర్కొన్నారు. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తీశాడని ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి.
మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేమంటూ హ్యాట్సాఫ్ రితీశ్ రాణా అంటూ కితాబు ఇవ్వడం విశేషం.