త్యాగానికి ప్రతీక మొహరం
ఎస్పీ మణికంఠ చందనవోలు
చిత్తూరు జిల్లా – మొహరం సందర్బంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందనవోలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు సురక్షితమైన మొహరం శుభాకాంక్షలు తెలిపారు. మొహరం మాసం త్యాగానికి, శాంతి, సమానత్వం, సామరస్యతకు ప్రతీక అని పేర్కొన్నారు ఎస్పీ.
మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్మరణకు గుర్తుకు ప్రతి ఏటా మొహరం జరుపుకుంటారని , ఇది ఆనవాయితీగా వస్తుందని స్పష్టం చేశారు మణికంఠ చందనవోలు.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, మొహరం పండుగ ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగగా భక్తి భావంతో, శాంతిని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రజల మధ్య స్నేహ భావం పెంపొందించు కోవడం ద్వారా మనం సుదీర్ఘమైన శాంతిని సాధించగలమని చెప్పారు.
అందరూ సురక్షితంగా ఉండాలని, మొహరం సందర్భంగా ప్రార్థనలు శాంతి యుతంగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.