డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ అరెస్ట్
ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి కూడా
హైదరాబాద్ – ప్రముఖ కొరియోగ్రాఫర్ తో పాటు ఆర్కిటెక్చర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నగరంలోని మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు ప్రముఖ ఆర్కిటెక్చర్ గా గుర్తింపు పొందిన ప్రియాంకా రెడ్డి.
ఈ డ్రగ్స్ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఓయో రూమ్ లో తనిఖీ చేయగా ప్రియాంకా రెడ్డితో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి కూడా ఉన్నారు. వీరితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు కన్హ మహంతి. ప్రత్యేకించి తనకు ఢీ కార్యక్రమం బాగా పేరు తీసుకు వచ్చేలా చేసింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల మాదక ద్రవ్యాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.