ఝలక్ ఇచ్చిన పోలీసులు
అమరావతి – మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. సీఐడీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో తనపై కేసు నమోదైంది. ఈ సందర్బంగా నోటీసు అందజేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ హయంలో కీలక పాత్ర పోషించారు. అధికారం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా వారి కుటుంబాన్ని ఏకి పారేస్తూ వచ్చారు.
దీంతో పలుచోట్ల విజయసాయి రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. దీనిని ఆయన లైట్ గా తీసుకున్నారు. కూటమి సర్కార్ కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. మరో వైపు వైఎస్ఆర్సీపీ లో ముఖ్య భూమిక పోషించారు. జగన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 గా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్మయానికి గురి చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించారు. ఇక తన శేష జీవితం వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని స్పష్టం చేశారు. అయితే తను బీజేపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.