లాయర్ నిర్వాకం సీజేఐ ఆగ్రహం
చివరకు తప్పైందని క్షమాపణ
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అయితే కేసు తరపు వాదిస్తున్న లాయర్ నోరు జారారు. అంతే కాకుండా గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీజేఐ. ఇది ఇల్లు కాదని , న్యాయానికి చిరునామా అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
కింది స్థాయి కోర్టుల్లో వ్యవహరించినట్లు ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందని అనుకోవడం ఓ భ్రమ అని కొట్టి పారేశారు. న్యాయమూర్తులతో ఎలా మెలగాలో, ఎలా కేసులను వాదించాలనే దానిపై సీనియర్ లాయర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోవాలని సదరు లాయర్ కు సూచించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ రైలు లోనైనా ఎక్కే రైల్వే ప్లాట్ ఫారమ్ సుప్రీంకోర్టు కాదని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. ఇదిలా ఉండగా న్యాయ సంస్కరణల కోసం తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సమర్పించానని, అత్యవసర విచారణ కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ.