డాక్టర్ కేసును రాజకీయం చేయొద్దు – సీజేఐ
కపిల్ సిబల్ అభ్యంతరం చంద్రచూడ్ ఆగ్రహం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసుకు సంబంధించి మరోసారి దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రేప్, మర్డర్ కేసు అంశాన్ని రాజకీయం చేయొద్దని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీజేఐ ఒకింత ప్రభుత్వం తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము 2018 మార్గ దర్శకాలను అనుసరిస్తూ వచ్చామని, దానిక ప్రకారమే అన్ని ఆధారాలను తమ ముందు సమర్పించడం జరిగిందని తెలిపారు కపిల్ సిబల్. ఈ సందర్బంగా జోక్యం చేసుకున్న సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
మీ ఎఫ్‌ఐఆర్‌ను రాత్రి 11:30 గంటలకు నమోదు చేయడాన్ని సమర్థించదు. 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి కారణం ఏమిటి? ప్రిన్సిపాల్ ముందుకు వచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ఎందుకు అడగలేదు అని నిలదీశారు .