సీజేఐ చంద్రచూడ్ ను మార్చిన కూతురు
ప్రధాన న్యాయమూర్తి మనసులోని మాట
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నీతి, నిజాయితీ, నిబద్దత అనే అంశాలను ప్రాతిపదికగా చేసుకుని తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అంతే కాదు ధర్మ బద్దమైన జీవితం ఎలా గడపాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు.
ఈ మధ్యన సీజేఐ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాంసహారిగా ఉన్న తనను తన కూతురు శాకాహారిగా మార్చిందంటూ వెల్లడించారు. ప్రస్తుతం సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
క్రూరత్వం లేని జీవితాన్ని గడపమని తన కుమార్తె తనను కోరిందని, అది శాకాహారిగా మారడానికి దారి తీసిందని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. ఆయనకు ఇద్దరు ప్రత్యేక సామర్థ్యం కలిగిన కూతుళ్లు ఉన్నారు. వారే ఆయన ప్రపంచం.
ఆనాటి నుంచి నేటి దాకా తాను లేదా తన భార్య ఎలాంటి పట్టు లేదా తోలు ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని అన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో సాగర్ రత్న రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ.
ప్రతి హైకోర్టు ఒక ఫలహార శాలను వికాలంగుల నిర్వహణ కోసం ఎందుకు ప్రారంభించ కూడదని అన్నారు చంద్రచూడ్.