రాష్ట్రపతితో ప్రధాన న్యాయమూర్తి భేటీ
వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మర్యాద పూర్వకంగా దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. సీజేఐతో పాటు ఆయన భార్య కల్పనా దాస్ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు.
భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం త్వరలోనే పూర్తి కానుంది. ఈ సందర్బంగా కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయ పరంగా సంచలన తీర్పులు వెలువరించారు సీజేఐ. ఇదే సమయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల వినాయక చవితి సందర్బంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ స్వయంగా తనంతకు తానుగా సీజేఐ జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం, అక్కడ పూజలు చేయడం సంచలనంగా మారింది.
దేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీ కాలంలో ఉన్న సమయంలో ఎలా పీఎంను ఆహ్వానిస్తారంటూ పెద్ద ఎత్తున మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్ కు గురయ్యారు.