సీఎంకు షాక్..జడ్జిని మార్చండి
సంచలన తీర్పు చెప్పిన సీజేఐ
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా విద్యుత్ కాంట్రాక్టులపై విచారణకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక బాధ్యత కలిగిన చైర్మన్ ఎలా మీడియా సమావేశం నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. న్యాయం చెప్పాలే తప్పా నిష్పక్ష పాతంగా ఉండాలని హితవు పలికారు. వెంటనే సదరు జడ్జిని మార్చండి అంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాలనా కాలంలో విద్యుత్ కాంట్రాక్టులపై చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని తప్పు పట్టారు మాజీ సీఎం. అంతే కాకుండా 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపుతో కమిషన్ ఏర్పాటు చేశారంటూ ఆరోపించారు. కమిషన్ చేసిన వ్యాఖ్యలు తనను బాధ పెట్టాయని పేర్కొన్నారు. వెంటనే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని కోరారు.
ఇవాళ విచారణ చేపట్టిన సీజేఐ వెంటనే జడ్జిని మార్చాలని తీర్పు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు.