లాయర్ అంతరాయం సీజేఐ ఆగ్రహం
సెక్యూరిటీని పిలవండన్న చంద్రచూడ్
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సుప్రీంకోర్టులో నీట్ యుజి 2024 స్కామ్ కు సంబంధించిన కేసుపై విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా పదే పదే విచారణకు అంతరాయం కలిగించిన లాయర్ (న్యాయవాది)పై నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినిపించు కోలేదు..మరోసారి పట్టించుకోక పోవడంతో సీరియస్ అయ్యారు.
న్యాయవాది మాథ్యుస్ నెడుంపరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీజేఐ డీవై చంద్రచూడ్. కోర్టులో ఎలా ఉండాలో తను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎంతకూ వినిపించుకోక పోవడంతో కోర్టు గది నుండి బయటకు వెళ్లాలని కోరారు. నీట్ అనేది మెడికల్ కోర్సులలో ప్రవేశానికి అఖిల భారత పరీక్ష. పిటిషనర్ల తరపున వాదించారు నరేందర్ హూడా. ఇదే సమయంలో మాథ్యూస్ నెడుంపర హాజరై అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విచారణలో భాగంగా బెంచ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నెడుంపర కోర్టు ముందు ఉన్న న్యాయవాదులందరిలో తాను సీనియర్ అని అన్నారు. ఇదే సమయంలో మరో అడుగు ముందుకేసి తనను గౌరవించక పోతే తాను వెళ్లి పోతానని పేర్కొన్నడంతో సీరియస్ అయ్యారు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
వినిపించకోక పోవడం, పదే పదే అంతరాయం కలిగించడం సెక్యూరిటీని పిలవాలని ఆదేశించారు.