భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. మంగళవారం ఎంతో ఉత్కంఠ రేపిన ఈ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును సర్వోన్నత న్యాయస్థానం ‘భయంకరమైనది’గా అభివర్ణించింది. యువ వైద్యులకు సురక్షితమైన పని పరిస్థితులు లేక పోవడం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ధర్మాసనం పేర్కొంది.
“మహిళలు పనికి వెళ్లలేక పోతే, పరిస్థితులు సురక్షితంగా లేకపోతే, తాము వారికి సమానత్వాన్ని నిరాకరిస్తున్నాము” అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియోలు మీడియాలో రావడం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
యువ వైద్యులు 36 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు, సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి జాతీయ ప్రోటోకాల్‌ను రూపొందించాలని స్పష్టం చేశారు జస్టిస్ పార్థివాలా, మనోజ్ మిశ్రా.