మాజీ చీఫ్ మద్దతుదారులు..ఆర్మీ మధ్య వార్
సిరియా – సిరియా అంతర్యుద్దంతో అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా మాజీ చీఫ్ బషర్ అల్ అసద్ మద్దతుదారులు..ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అత్యంత ఘోరమైన దుర్గటనగా పేర్కొంటున్నాయి వార్తా సంస్థలు. గత ఏడాది తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. దీంతో దేశ అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారి పోయాడు. అక్కడ తలదాచుకున్నాడు. డమాస్కస్ లో కొత్త సర్కార్ కొలువు తీరింది. దీనిని తట్టుకోలేక అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టు పెట్టాయి.
ఈ హింస్మాతక దాడుల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగాయి. ఈ క్రమంలో వారి ఇళ్లకు నిప్పంటిచడం వల్ల ఘర్షణలు పెద్దవయ్యాయి. బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని తీసుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, దాడుల్లో మృతి చెందిన ఐదుగురు సిరియన్ దళాలకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనికి అనేక మంది ప్రజలు హాజరయ్యారు.