5న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈనెల 5వ తేదీన ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతుండడం విశేషం.
ఇదే సమయంలో ఆప్ వర్సెస్ బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేజ్రీవాల్. తెలంగాణ మోడల్ ను ఢిల్లీలో గెలిపిస్తే అముల చేస్తామన్నారు సీఎం. విచిత్రం ఏమిటంటే తన గురువు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం ఇవాళ ఢిల్లీ బాట పట్టారు.
తను ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నుంచి పాల్గొననుండడం విస్తు పోయేలా చేస్తోంది.
తాము గనుక పవర్ లోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు ఇటీవల మరాఠాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.