అల్లు అర్జున్ పై సీఎం సీరియస్
నిప్పులు చెరిగిన ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నటుడు అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. తన కారణంగానే చని పోయారని ఆరోపించారు. అల్లు అర్జున్ కు ఏమైందని పరామర్శించారని ప్రశ్నించారు.
బన్నీ ఇంటికి క్యూ కడుతున్న సెలబ్రిటీలు శ్రీతేజ్ ను ఎందుకు పరామర్శించ లేదన్నారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా , కాళ్లు పోయినవా, కిడ్నీలు పాడై పోయాయా అని మండిపడ్డారు. శనివారం శాసన సభలో అల్లు అర్జున్ వ్యవహారంపై నిలదీశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.
దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయన ఏమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడా అని మండిపడ్డారు. ఒక్క రోజు జైలుకు వెళ్లి వచ్చినందుకే ఇలా పరామర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 2న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భద్రత కల్పించాలని సంధ్య థియేటర్ యాజమాన్యం కోరిందని, హీరో, హీరోయిన్, నిర్మాత, సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తులకు రక్షణ కల్పించాలని యాజమాన్యం కోరిందని సీఎం వివరించారు.
ప్రముఖులు ఎవరు వచ్చినా తాము రక్షణ కల్పించలేమని పోలీసులు స్పష్టం చేశారని తెలిపారు. అయినా పట్టించు కోలేదని ఆరోపించారు.