సీఎం ఎ. రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. ఆయన ఓ చెల్లని రూపాయి అంటూ మండిపడ్డారు. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయం చేశాడని, అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. కేటీఆర్ ఓ పిచ్చోడంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. చిట్ చాట్ సందర్బంగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి.
అందుకే బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టారని, ప్రజా పాలనకు పట్టం కట్టారని చెప్పారు సీఎం. ఇప్పుడు కేసీఆర్ ను ఆయన ఫ్యామిలీ చేసిన దురాగతాలను ప్రజలు ఎప్పటికీ మరిచి పోరని అన్నారు. ఎన్ని అవాకులు చెవాకులు పేలినా అధికారంలోకి రావడం కుదరదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయి పోయారని పేర్కొన్నారు. తాము వచ్చాక ప్రజా పాలన అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి.