Thursday, April 3, 2025
HomeNEWSకేసీఆర్ కుటుంబం నుంచే ప్రాణ హాని

కేసీఆర్ కుటుంబం నుంచే ప్రాణ హాని

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ – అసెంబ్లీ వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. త‌ను వందేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అన్నారు. కేసీఆర్ ప్ర‌తిప‌క్షంలో ఉండి త‌మ‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని ఆశిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఖ‌జానాలో ఏమీ లేద‌న్నారు. ఉన్న‌దంతా బీఆర్ఎస్ హ‌యాంలోనే ఎత్తుకు వెళ్లార‌ని, లంకె బింద‌లు ఉన్నాయ‌ని అనుకుంటే ఏ ఒక్క‌టి దొర‌క‌డం లేద‌న్నారు. ఇక కేసీఆర్ వ‌ద్ద ఏముంద‌ని తీసుకోవడానికి అని ప్ర‌శ్నించారు. కుటుంబ స‌భ్యుల వ‌ల్ల‌నే కేసీఆర్ కు ప్రాణ హాని ఉంద‌ని, అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శ‌నివారం కేసీఆర్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నామ‌న్నారు. పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు సీఎం. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయ‌ని పేర్కొన్నారు. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని అన్నారు. పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments