ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ కటుంబం మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఉగ్ర రూపం దాల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్లు ఫ్రాడ్ చేసినట్లుగా నివేదికలున్నాయని, త్వరలోనే జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్ర వీగిన కేసీఆర్ ను బండ కేసి కొట్టారని అన్నారు. అందుకే కామారెడ్డిలో అడ్రస్ లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
తాను ఆరోజే చెప్పానని, పోతాపోతా నిన్ను పట్టుకపోతా అని అన్నారు. తెలంగాణ ప్రదాత, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ జాతిపిత అనే నాయకుడిని చిత్తుచిత్తుగా కామారెడ్డి ప్రజలు ఓడించి సామాన్యుడిని ఎమ్మెల్యేగా గెలిపించారని అని సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ఆగ్రహం ఎలా ఉందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు బీఆర్ఎస్ నేతలకు. తాము పవర్ లోకి వచ్చాక 15 నెలల్లో 57946 జాబ్స్ ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. తాను గనుక ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఏ ఒక్కరు బయట ఉండరని వార్నింగ్ ఇచ్చారు. తనను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టామని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.