సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఒకరు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడితే మరొకరు తెలంగాణ పేరుతో జనాన్ని నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు సీఎం.
తాము వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజా పాలన అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచేలా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని రీతిలో స్కిల్ డెవపల్మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రూ. 100 కోట్లకు పైగా యూనివర్శిటీ అభివృద్ది , మౌలిక సదుపాయల కల్పనకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. గత సర్కార్ కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందన్నారు. కానీ తాము ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను తీసుకు వచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ సర్కార్ కే దక్కిందన్నారు.