10 రోజులకు పైగా ఉండే ఛాన్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మిగతా మంత్రులు ఎవరూ వెళ్లక పోవడం విశేషం.
రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడిదారులు, కంపెనీల చైర్మన్లు, సిఈవోలు , ఇతర ప్రముఖులతో ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం కాక ముందు, అయ్యాక పలుమార్లు రేవంత్ రెడ్డి పర్యటించారు. తాజాగా యుఎస్ఏకు వెళ్లడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు సీఎం. దీనికి సంబంధించి భారీ ఎత్తున నిధులు కావాల్సి వస్తుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారని ఆరోపించారు.
అప్పులు చేసైనా సరే రైతు రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఉద్యోగస్తులకు ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తూ వస్తున్నామని టీచర్లతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.