NEWSTELANGANA

ప్రియాంక గాంధీ విజ‌యం అద్భుతం

Share it with your family & friends

ప్ర‌శంసలు కురిపించిన సీఎం

హైద‌రాబాద్ – వాయ‌నాడు లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో రికార్డ్ విజ‌యాన్ని న‌మోదు చేశారు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. ఆమె ఏకంగా 3.68 ల‌క్ష‌ల మెజారిటీని సాధించారు. గ‌తంలో త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ . ఈ సంద‌ర్బంగా ప్రియాంక గాంధీ విజ‌యం ప‌ట్ల స్పందించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి.

ఆయ‌న శ‌నివారం ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రియాంక గాంధీ సాధించిన ఈ విజ‌యం పార్టీకి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తుందని స్ప‌ష్టం చేశారు. వాయ‌నాడు ప్ర‌జ‌లు పార్టీపై, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నార‌ని ఈ ఫ‌లితంతో తేలి పోయింద‌న్నారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి.

ప్రగతి, సుస్థిరత కోసం కాంగ్రెస్ పార్టీ దార్శనికతపై ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, అవకాశాల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ, వాయనాడ్‌కు శ్రేయస్సు తీసుకు రావడానికి అంకితభావంతో పని చేస్తార‌ని అన్నారు. ప్రియాంక గాంధీ పార్లమెంటులో బలమైన గొంతుకగా నిలుస్తుందని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్నారు అనుముల రేవంత్ రెడ్డి.