వీర నారి ఐలమ్మకు సీఎం నివాళి
అర్పించిన అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – వీర నారి ఐలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్బంగా గురువారం జూబ్లీ హిల్స్ నివాసంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గణేష్ , తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఆనాడు దేశ్ ముఖ్ లతో , రజాకార్లతో, భూ ఆక్రమణదారులతో తను ఒక్కతే పోరాటం సాగించారు చాకలి ఐలమ్మ.
పోరాట యోధురాలిగా గుర్తింపు పొందారు. ఆమె సాగించిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఐలమ్మ బతికి ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.