మోడీ..షా ఆప్ ను ఓడించ లేరు
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను అరెస్ట్ చేశాక ఢిల్లీలో కొలువు తీరిన ఆప్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకున్నారని కానీ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఆటలు సాగ లేదన్నారు. వారు ఊహించని దానికంటే ఎక్కువగా తమకు ఆదరణ లభించిందని చెప్పారు.
శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ ఛానల్ తో సంభాషించారు. ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను జైలుకు పంపించినంత మాత్రాన ప్రజల హృదయాలలో నిలిచిన ఆప్ ను తొలగించ లేరన్నారు సీఎం.
తమను ఓడించాలంటే ఇంకా పదేళ్లు సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు తాము దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని, బీజేపీకి షాక్ ఇవ్వడం ఖాయమని జోష్యం చెప్పారు. తాను రాజీనామా చేస్తానని భావించారని, చివరకు కోర్టుకు కూడా వెళ్లారని వారి ప్లాన్ వర్కవుట్ కాలేదన్నారు. తాను జైలుకు వెళ్లినా చివరకు విజేతగా వస్తానని ప్రకటించారు.