ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం
చాబేవాల్ ఉప ఎన్నిక సందర్బంగా కామెంట్స్
పంజాబ్ – ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆప్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఆదివారం చబేవాల్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్బంగా జరిగిన కీలక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భగవంత్ మాన్. తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. కానీ ఆప్ సర్కార్ కొలువు తీరాక ఇచ్చిన హామీలను అమలు పర్చడం జరిగిందన్నారు. గతంలో వెట్టి చాకిరి చేస్తున్న కాంట్రాక్టు కింద పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగిందని చెప్పారు.
పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తన అభిమతమని, ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. గతంలో ఎలాగైతే ఆప్ ను ఆశీర్వదించారో ఈసారి కూడా అలాగే గెలిపిస్తారని, తన నమ్మకాన్ని వమ్ము చేయరన్న నమ్మకం తనకు ఉందన్నారు భగవంత్ మాన్.
ఇదిలా ఉండగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నాకు మనస్ఫూర్తిగా మద్దతిచ్చి ఈ నియోజకవర్గ భవితవ్యాన్ని మార్చడంలో మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మీ ఉత్సాహం అభిరుచి చాబేవాల్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు సీఎం.