భారత కూటమికి ఓటేయండి
పిలుపునిచ్చిన భగవంత్ మాన్
న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్రస్తుతం రాచరికం రాజ్యం ఏలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇవాళ తమ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి వచ్చానని చెప్పారు.
ఆయన ప్రశాంతంగా ఉన్నారని, ఢిల్లీ గురించి బెంగ చెందడం లేదన్నారు. కానీ ఆయన ఆవేదన , ఆందోళన అంతా ఈ దేశం గురించేనని అన్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో మోదీ నియంతృత్వ పాలన సాగించడమేనని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు భగవంత్ మాన్. దేశాన్ని, డెమోక్రసీని కాపాడేందుకు భారత కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని దేశ ప్రజందరికీ పిలుపునిచ్చారు సీఎం.
భారతీయ జనతా పార్టీ కేవలం కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని , ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. భారత కూటమికి 250కి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు భగవంత్ మాన్.