దర్శించుకున్న వంగలపూడి అనిత
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ , పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అమ్మ వారి కృప ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. ఆమె దయ వల్ల తాము ఈ స్థితిలో ఉన్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ శుభం కలగాలని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, దారుణాల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈసారి అలాంటివి ఏవీ ఉండబోవమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తమ సర్కార్ కృషి చేస్తుందన్నారు వంగలపూడి అనిత.