పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు
అమరావతి – స్వచ్ఛత, శుభ్రత అనేది ప్రజల నినాదంగా మారాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పచ్చదనం, పరిశుభ్రత మీద దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రతి ఒక్కరు పారిశుధ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని, ఇంటి ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు .
ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరని అన్నారు.. డస్ట్‌బిన్లలో వేస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. మున్సిపాలటీల్లో స్వచ్ఛతతో ముందుకు వెళతామన్నారు. దేశ విదేశాలు తిరిగి ప్రధానికి పరిశుభ్రతపై సమగ్రమైన నివేదక ఇచ్చానని గుర్తు చేశారు. మూడవ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్రపై శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు సీఎం.
గత ప్రభుత్వం పచ్చదనం, పరిశుభ్రతపై ఫోకస్ పెట్టలేదని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము వచ్చాక పూర్తిగా అన్నింటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.