Thursday, April 3, 2025
HomeDEVOTIONALప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం దంప‌తులు

ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం దంప‌తులు

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం వైభవోపేతం

అమ‌రావ‌తి – అమ‌రావతిలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దంప‌తులు స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి , బోర్డు స‌భ్యులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం శ్రీ వేంకటేశ్వ‌ర స్వామి ఆల‌యంలో క‌న్నుల పండువ‌గా జ‌రిగింది క‌ళ్యాణోత్స‌వం. భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ముఖ్య అతిథులుగా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్, సీఎం చంద్ర‌బాబు దంప‌తులు హాజ‌ర‌య్యారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ల‌క్ష‌లాది మంది క‌ళ్యాణోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని తిల‌కించారు.

సాధారణంగా కల్యాణోత్సవం ప్రతిరోజూ తిరుమల కొండ పుణ్యక్షేత్రంలో అర్జిత సేవ (చెల్లింపు సేవ)గా నిర్వహిస్తారు, ఇది పరిమిత సంఖ్యలో యాత్రికులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ దివ్య వివాహ వేడుకను ఎక్కువ మంది భక్తులు వీక్షించేలా, 2012 సంవత్సరంలో టిటిడి ప్రత్యేకంగా శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. తిరుమలకు చేరుకోలేని లేదా దేవతల దివ్య వివాహాన్ని చూడలేని యాత్రికులకు ఇది ఒక వరం లాంటిది.

గత 13 సంవత్సరాలలో, 964 శ్రీనివాస కళ్యాణాలు జరిగాయి, వాటిలో 903 భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి, మిగిలిన 61 ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్వహించబడ్డాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments