అమరావతిలో సీఎం పర్యటన
పరిశీలంచనున్న చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కలల పంట , రాజధాని నగరం అమరావతి. ఆయన దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద కేపిటల్ సిటీగా రూపొందంచాలని భావించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అన్నింటికి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని కోరుకున్నారు.
ఇదే సమయంలో వైసీపీ గెలుపొందడం తాము అధికారానికి దూరం కావడంతో ఐదేళ్ల పాటు అమరావతి దిక్కులేనిదిగా మారి పోయింది. ఎవరైతే రైతులు తమ పొలాలను అమ్ముకున్నారో వారికి న్యాయం చేయలేక చేతులెత్తేసింది గత సర్కార్.
ఐదేళ్ల పాటు అమరావతిని పక్కన పడేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ అనూహ్యంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి పవర్ లోకి వచ్చింది. దీంతో మూడు రాజధానుల కథకు పుల్ స్టాప్ పెట్టేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
మరోసారి వేదిక పైనుంచే ప్రకటించారు ఇక నుంచి ఏపీకి రాజధాని అమరావతినేనని . ఇందులో భాగంగా జూన్ 20న గురువారం చంద్రబాబు పనిగట్టుకుని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులను అంచనా వేయనున్నారు. రెండున్నర ఏళ్లలో దాని రూపు రేఖలు మార్చేందుకు రెడీ అయ్యారు.