NEWSANDHRA PRADESH

టీటీడీతో సీఎంకు సంబంధం లేదు – లోకేష్

Share it with your family & friends

మాట మార్చిన ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి

అమ‌రావ‌తి – తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశంగా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న‌టి దాకా ప్ర‌తిప‌క్ష పార్టీని, అధినేత జ‌గ‌న్ రెడ్డిని, ఆయ‌న ప‌రివారాన్ని ఏకి పారేస్తూ వ‌చ్చిన నారా లోకేష్ ఉన్న‌ట్టుండి తిరుప‌తి ప్ర‌సాదం విష‌యంలో త‌న తండ్రి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది.

అంతా జ‌గ‌న్ చేశాడ‌ని, ఆయ‌న హ‌యాంలోనే టీటీడీ ప్ర‌తిష్ట దిగ జార్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా లోకేష్. ఇక ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీ విష‌యంలో జంతు, చేప నెయ్యి వాడారంటూ సాక్షాత్తు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం దేశ‌మంత‌టా గ‌గ్గోలు పెట్ట‌డం జ‌ర‌గింది.

ఈ స‌మ‌యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ తిరుప‌తి ల‌డ్డూ వివాదానికి సంబంధించి ఏపీ సీఎంకు ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశారు. టీటీడీకి ముఖ్య‌మంత్రికి ఎలాంటి క‌నెక్ష‌న్ ఉండ‌ద‌ని, ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది స్వ‌తంత్ర సంస్థ అంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రి ఇండిపెండెంట్ సంస్థ అయితే ఎందుకు చైర్మ‌న్, బోర్డు స‌భ్యుల‌ను, ఈవోను సీఎం నియ‌మించార‌నే ప్ర‌శ్న‌కు లోకేష్ ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.