NEWSANDHRA PRADESH

కుప్పంతో జ‌న్మ జ‌న్మ‌ల‌ బంధం

Share it with your family & friends

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

కుప్పం – మ‌రో జ‌న్మంటూ ఉంటే కుప్పంలోనే పుట్టాల‌ని ఉంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టింది మీరేనంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన అనంత‌రం తొలిసారిగా కుప్పంలో అడుగు పెట్టారు.

ఈ సంద‌ర్బంగా త‌న‌కు నీరాజ‌నం ప‌లికిన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కుప్పం ప్ర‌జ‌ల‌తో విడ‌దీయ‌లేని బంధం త‌న‌కు ఉంద‌న్నారు. వెనకబాటుతనం ఉండే కుప్పాన్ని అభివృద్ది చేయాలని నాడు ఈ నియోజకవర్గానికి వచ్చానని అన్నారు.

ప్రత్యేక ప్రణాళికతో కుప్పాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం రూ. 4.5 కోట్ల విరాళం అందించిన మ‌హిళా సంఘాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఏపీ సీఎం.

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి…అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుండి రూ.100 దోచుకుంద‌న్నారు.

కానీ తమ ప్రభుత్వం రూ.15 ఇచ్చి…రూ.100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికం లేని సమాజం సాధించేలా పాలన అందిదస్తామని ముఖ్యమంత్రి అన్నారు.